ఙ్ఞానానికి ప్రతీక దీపం. అలాంటి అనేకానేక దీపాలను వరుసగా నిల్పి జీవితాలను ప్రకాశింపజేసి సోమరితనం, అహంభావం,అఙ్ఞానం వంటి దుర్లక్షణాల్ని తరిమివెసే ఆకర్షణీయమైన పండుగ - దీపావళి
దీపం చీకటిని పారద్రోలుతుంది. అలాగే మన జీవితాలలో నుండి దుఃఖాన్ని పరిహరించి.తద్వారా సుఖ సంతోషాలను ఆహ్వనించడానికి తగు పూర్వ రంగాన్ని ఏర్పరిచే అరుదైన పండుగ - దీపావళి
ఆకాశం అద్భుతాలకు నెలవు. కానీ ఆకాశమే అచ్చెరువొంది - భూమి వంక ద్రుష్టి సారించి విస్తుపోయి జేజేలు చెప్పే కమనీయమైన పండుగ - దీపావళి
ఈ 'వెలుగుల పండుగ ' పూట మీ ఇల్లు ...
చిచ్చుబుడ్లలాంటి చిచ్చర పిడుగుల కేరింతలతో,
టపకాయల భాజా భంత్రీలతో ,
ఆనందాల భుచక్రాల్లాంటి తరుణుల వెలుగు జిలుగులతో,
కాకరపువ్వుల్లా వెల్లివిరిసే పురుషుల నవ్వులతో ...కళకళలాడనీ,
ఆకాశమే అవధిలా దూసుకుపొయే "రాకెట్"లా మీ భవిష్యత్తులో విజయాలు వరుస కట్టి, పిదప గుమిగూడి ఆపై ఉక్కిరిబిక్కిరి చేయాలనీ ...పై విజయాలన్నీ చిన్నబోయే "అద్భుతం" సాక్షాత్కరించి, తరింపజేయాలనీ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ
దీపావళి శుభాకాంక్షలతో
మీ స్నేహితుడు
నటరాజ్
ఆయిత శ్రీనివాస్ (మా బాబాయి ) సౌజన్యం తో
నటరాజ్
ఆయిత శ్రీనివాస్ (మా బాబాయి ) సౌజన్యం తో